డ్జెట్ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ గాలక్సీ A08ను 4జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గతేడాది విడుదలైన గాలక్సీ A07కు కొనసాగింపుగా A సిరీస్‌లో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పెద్ద డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 25W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో దీనిని  బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-యూ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం MediaTek Helio G99 6nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 4GB LPDDR4X RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రోSD కార్డ్ ద్వారా ఏకంగా 2TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఆరు తరాల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శామ్‌సంగ్ ప్రకటించింది. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అందించారు. ప్రధాన కెమెరాకు f/1.8 అపర్చర్, డెప్త్ సెన్సార్‌కు f/2.4 అపర్చర్ ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. డిస్‌ప్లే నాచ్‌లో 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపర్చర్‌తో ఈ కెమెరా పనిచేస్తుంది. దీనిలో 6,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే ఫోన్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇది  నేవీ బ్లూ, సిల్వర్, గ్రీన్ కలర్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 10,699 ఉక్రేనియన్ హ్రైవ్నియాగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.23,000గా ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ వంటి కొన్ని మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సెర్బియా, దక్షిణాఫ్రికా వంటి మరికొన్ని దేశాల వెబ్‌సైట్లలో కూడా Galaxy A08 లిస్టింగ్ కనిపిస్తోంది. 

Post a Comment

أحدث أقدم