జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 12న జరగనుంది. ఈ భేటీ ఎజెండా ఇంకా అధికారికంగా విడుదల కాకపోయినా, స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ తగ్గించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం మొబైళ్లపై 18 శాతం జీఎస్టీ ఉంది. ఇది మార్కెట్లో ఫోన్ల ధరలు, ఆఫర్లను నేరుగా ప్రభావితం చేస్తోంది.  ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ మొబైళ్లపై పన్నును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తే కంపెనీలు బేస్ ప్రైస్ పెంచనంత వరకు ఎంఆర్ఫీ ధరల్లో దాదాపు 5 శాతం వరకు తగ్గుదల ఉంటుంది. కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారు, అర్జెంట్ అవసరం లేని విద్యార్థులు సెప్టెంబర్ 12 వరకు వేచి చూడటం మంచిది. 

Post a Comment

أحدث أقدم