వివో వీ 40ఈ 5జీ స్లిమ్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, మీడియా టెక్ డిమెన్షిటీ 7300 ప్రాసెసర్, 50MP Sony OIS కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇస్తోంది.దీనిలో 6.77 అంగుళాల FHD+ AMOLED 3D Curved Display అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. అల్ట్రా-స్లిమ్ డిజైన్, Royal Bronze, Mint Green కలర్ ఆప్షన్లు ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ ఉన్నాయి. రోజువారీ మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. ఫోన్‌లో 50MP Sony IMX882 OIS మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం 50MP Eye AF ఫ్రంట్ కెమెరా ఉంది. AI Portrait Suite, AI Eraser, AI Photo Enhancer, Aura Light Portrait, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిలో 5,500mAh బ్యాటరీను అందించారు. దీనికి 80W FlashCharge సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ప్రీమియం డిజైన్‌తో పాటు శక్తివంతమైన పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం వివో వీ 40ఈ 5జీ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق