దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 30న ఐక్యూ నియో 10 ఫోన్ కొత్త వేరియంట్ లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కలర్ వేరియంట్ వివరాలు అందించింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ని 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఐ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 ప్రోసెసర్ మరియు జతగా iQOO Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ తో పని చేస్తుంది. ఇది ఫ్లాగ్ షిప్ స్థాయి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు 144FPS గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 50MP Sony OIS మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ తో డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 7000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది.
ఏప్రిల్ 30న ఐక్యూ నియో 10 ఫోన్స్ కొత్త వేరియంట్లు విడుదల
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق