న్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అసభ్యకర కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాలని సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్‌లైన్ వేదికలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. లేదంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 ప్రకారం థర్డ్‌పార్టీ సమాచారాన్ని అప్‌లోడ్‌, ప్రచురణ, లేదా వ్యాప్తి చేస్తే ఆయా వేదికలదే బాధ్యత అని గుర్తుచేసింది. నిబంధనలు పాటించకుంటే ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ సహా ఇతర చట్టాల కింద తీవ్ర పరిణామాలు తప్పవని ఉద్ఘాటించింది.

Post a Comment

أحدث أقدم