హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ మె ట్ సమీపంలోని బాటసింగారం వద్ద సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఓ బైక్ పై ఉన్న ముగ్గురు విద్యార్థినులు కిందపడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళుతున్న లారీ కిందపడటంతో హంసలేఖ (22) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలు దిల్ సుఖ్ నగర్ కు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎదురెదురుగా రెండు బైకులు ఢీ : పక్క నుంచి వెళ్తున్న లారీ కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق