మెజాన్‌లో పోకో సీ 55 స్మార్ట్ ఫోన్ రూ. 13,999కి బదులుగా రూ. 6,499కి అందుబాటులో ఉంది. MRPపై 54 శాతం భారీ తగ్గింపును ఇస్తున్నారు. ఇదే కాకుండా కస్టమర్లకు పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అలాగే, వినియోగదారులు తమ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.6,150 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, గరిష్ట తగ్గింపు కోసం ఫోన్ మంచి కండీషన్ లో ఉండాలి. ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్,కూల్ బ్లూ వంటి కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ MIUI 13పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్ 6GB వరకు RAM ఉంది. ఇది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 534 nits పీక్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల HD+ (720×1,650 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ వెనుక భాగంలో 50MP కెమెరా,సెకండరీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కోసం 5MP కెమెరా ఉంది. దీని బ్యాటరీ 5,000mAh. 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP52 రేట్ చేయబడింది.

Post a Comment

أحدث أقدم