దేశంలోని అనేక ప్రాంతాల్లో బస్సుల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసే ఉంటాం. ఇలాంటి వాటిపై ఆందోళన వ్యక్తంచేసిన ప్రభుత్వం ప్యాసింజర్ బస్సులు, స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ బస్సులలో అగ్ని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. బస్సులలో ఈ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయాలనే నిబంధన గతంలోనే ఉంది. అయితే పరిమిత స్థలం కారణంగా ఇది చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రయాణికులు కూర్చునే ప్రదేశాల్లో కూడా రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చాలా దూరం ప్రయాణించే బస్సులు, పాఠశాల బస్సులలో ఫైర్ అలారం ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సుదూర ప్రాంతాలకు నడుపుతున్న ప్యాసింజర్ బస్సులు, పాఠశాల బస్సుల భాగంలో ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాహనాల ఇంజిన్ భాగం నుంచి వెలువడే మంటలను గుర్తించడం, అలారం సౌండింగ్, సప్రెషన్ సిస్టమ్ మాత్రమే అమలు చేశారు. వాహన పరిశ్రమ ప్రమాణం 135 ప్రకారం ఇంజిన్ మంటలు సంభవించినప్పుడు ఈ సిస్టమ్ హెచ్చరిస్తుంది. టైప్ -3 బస్సులు చాలా దూరం ప్రయాణించేలా రూపొందించారు. బస్సుల్లో అగ్నిప్రమాదాల సమయంలో అధిక ఉష్ణోగ్రత, పొగ కారణంగా బస్సులో కూర్చున్న ప్రయాణికులు తరచుగా గాయపడతారు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో ఫైర్ వార్నింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలారం మోగిన తర్వాత ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందికి దిగడానికి సమయం లభిస్తుందని వివరించింది.
ప్యాసింజర్, స్కూల్ బస్సులలో భద్రతా నిబంధనలను కఠినతరం?
الأحد، 30 يناير 2022
automobile science technologe ప్యాసింజర్ స్కూల్ బస్సులలో భద్రతా నిబంధనలను కఠినతరం?
ليست هناك تعليقات:
إرسال تعليق