కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటునంటూ కొండా సురేఖ ట్వీట్‌

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ మాజీ మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేశారు. ''ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో అలా మాట్లాడా, ఆనాడు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కేటీఆర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న దురుద్దేశం లేదు. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా'' అంటూ కొండా సురేఖ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ''కేటీఆర్‌పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.'' అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

إرسال تعليق

أحدث أقدم
3