పెరగనున్న నిత్యావసర ధరలు

నిత్యావసర వినియోగ వస్తువులైన  సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల వంటి  ధరలు పెరగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్‌, రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. మరోవైపు ముడిసరుకుల ధరల పెరుగుదల, తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడులపై ప్రభావం పడటం కంపెనీలకు సవాలుగా మారింది. ఈ పరిణామాలతో ఉత్పత్తుల తయారీ వ్యయం పెరిగి లాభాలపై ఒత్తిడి ఏర్పడుతోందని క్రిసిల్‌, ఎలరా క్యాపిటల్‌, కొటక్‌ నియో వంటి సంస్థల విశ్లేషణలు సూచిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులను కంపెనీలు పూర్తిగా భరించడం కష్టమైతే, కొంత భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశముంది. దీంతో రోజువారీ ఉపయోగించే వస్తువుల కొనుగోలుకు కుటుంబాలు మరింత ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ధరల పెంపుపై కంపెనీల నుంచి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు టెలికాం రంగంలోనూ ధరల పెంపుపై అంచనాలు వినిపిస్తున్నాయి. అంబిత్‌ క్యాపిటల్‌ నివేదిక ప్రకారం, డిసెంబర్‌ నాటికి ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ఖర్చుల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, మొబైల్‌ సేవల ధరల పెరుగుదల అదనపు భారంగా మారే అవకాశం ఉంది.

إرسال تعليق

أحدث أقدم
3