భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించిన స్టాక్ మార్కెట్లు

దేశీయ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ,బ్యాంకింగ్ రంగాల షేర్లలో చోటుచేసుకున్న గట్టి కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను పరుగులు పెట్టించింది. ప్రధాన సూచీలతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు సైతం సానుకూలంగా స్పందించడంతో మదుపరుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిచింది. సెన్సెక్స్ 905.01 పాయింట్లు (1.24%) బలపడి 74,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 237.90 పాయింట్లు (1.05%) లాభపడి 22,936.75 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో డిఫెన్సివ్, బ్యాంకింగ్ షేర్లు అత్యుత్తమ ప్రతిభ కనపరిచాయి. ముఖ్యంగా నిఫ్టీ రియల్టీ (2.75%), ఎఫ్‌ఎంసీజీ (2.34%) సూచీలు భారీ లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా 2.20% మేర పుంజుకుంది. అయితే, ఈ సానుకూల ధోరణికి భిన్నంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి; నిఫ్టీ ఆటో సూచీ 0.24% నష్టపోయింది. ఇక బ్రాడర్ మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు సుమారు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. రూపాయి 0.04% లాభంతో 95.25 వద్ద కదలాడుతోంది. 

إرسال تعليق

أحدث أقدم
3