న్యూజెర్సీలో కాల్పులు : ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

అమెరికాలోని న్యూజెర్సీ, ఎలిజబెత్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఘటన అనంతరం నిందితుడు ఎరుపు రంగు సెడాన్‌ కారులో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఘటన ఎలిజబెత్‌ నగరంలోని ఇర్వింగ్‌టన్‌ అవెన్యూ, ఎల్మ్‌వుడ్‌ ప్లేస్‌ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 8.30 గంటలకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు ఎలిజబెత్‌ పోలీసులు తెలిపారు. అయితే మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే వెల్లడించలేదు. కాల్పుల్లో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రి 9.45 గంటలకు ముందుగా సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తొలుత అందిన సమాచారం ప్రకారం.. ముగ్గురి కాళ్లకు బుల్లెట్‌ గాయాలు కాగా, మరొకరికి ఛాతీ భాగంలో గాయమైంది. క్షతగాత్రులను నెవార్క్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎరుపు రంగు సెడాన్‌ కారులో పశ్చిమ దిశగా మోరిస్‌ అవెన్యూ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వాహనం ఎరుపు రంగు నిస్సాన్‌ కారుగా భావిస్తున్నారు. కాల్పులకు పొడవైన తుపాకీని ఉపయోగించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై యూనియన్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి సమాచారం అందించినట్లు నివేదికలు వెల్లడించాయి. కాల్పులకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

إرسال تعليق

أحدث أقدم
3