ప్లాస్టిక్ కన్నా పేపర్ స్ట్రాలవల్ల క్యాన్సర్​ ముప్పు 16.18 రెట్లు అధికం : దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు

పేపర్ స్ట్రాలు పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే, అది కేవలం అపోహ మాత్రమేనని, నిజానికి ప్లాస్టిక్ కన్నా ఇదే ఎక్కువ ప్రమాదకరమని తమ అధ్యయనంలో తేలిందని కొరియన్ సైంటిస్టులు అంటున్నారు. ఈమేరకు సౌత్ కొరియా పర్యావరణ, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. పీపుల్ పవర్ పార్టీ ప్రతినిధి కిమ్ వి-సాంగ్ ఈ నెల 21న రిలీజ్ చేసిన అధ్యయన ఫలితాల్లో మిగతా వాటితో పోలిస్తే పేపర్ స్ట్రాలతో వెలువడే క్యాన్సర్ ముప్పు ఎక్కువని తేలింది. ఈ పేపర్ స్ట్రాల తయారీ, వినియోగం, డిస్పోజ్ చేసే ప్రక్రియలో వెలువడే కార్సినోజెనిక్ (క్యాన్సర్ కారక) ఉద్గారాలు సంప్రదాయ స్ట్రాలతో పోలిస్తే 6.33 రెట్లు ఎక్కువని బయటపడింది. పేపర్, బయోడిగ్రేడబుల్, బయో బేస్డ్ పాలియెత్లైన్ స్ట్రాలను సంప్రదాయ ప్లాస్టిక్ స్ట్రాలతో పోల్చి పరిశీలించినపుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సైంటిస్టులు తెలిపారు. ప్లాస్టిక్ స్ట్రాల తరహాలోనే మిగతా స్ట్రాలు కూడా మట్టిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. అందుకే, ప్లాస్టిక్ స్ట్రాలతో పోలిస్తే వీటివల్ల క్యాన్సర్​ ముప్పు ఏకంగా 16.18 రెట్లు అధికమని పేర్కొన్నారు. కాగా, వాడి పారేసిన స్ట్రాలను వ్యర్థాలుగా ఎలా మారుస్తున్నారనే దానిని కూడా ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నారు. జాతీయ వ్యర్థ గణాంకాల ఆధారంగా వినియోగించిన స్ట్రాలలో 73.6% దహనం, మిగిలిన 26.4% పూడ్చివేత ప్రదేశాలకు చేరుకుంటున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. మరోవైపు, స్ట్రాలను ఏ పదార్థంతో చేసినా సరే పరిమాణం కారణంగా వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టమని, వాటిపై ఉండే రసాయనిక పూతతో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్లాస్టిక్ స్ట్రాలపై మాత్రమే నిషేధం విధించడం సరికాదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కస్టమర్ అడిగితే తప్ప డిస్పోజబుల్ స్ట్రాలను ఇవ్వకూడదని దుకాణదారులకు సిఫారసు చేశారు.

إرسال تعليق

أحدث أقدم
3