Ad Code

ఆగస్టు 27న యమహా R2 బైక్ విడుదల

దేశీయ మార్కెట్లో సూపర్ సక్సెస్ అయిన 'R15' బైక్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో సరికొత్త 'యమహా YZF-R2' మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయడానికి యమహా సిద్ధమైంది. ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ, ఆగస్టు 27న ఈ బైక్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ పంపిన ఒక మీడియా ఇన్విటేషన్ ద్వారా తెలుస్తోంది.నూతన యమహా R2 బైక్ సుమారు 200cc లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న R15 బైక్ 155cc ఇంజిన్‌తో 18.4hp పవర్, 14.2Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు రాబోతున్న R2 మోడల్‌లో డిస్‌ప్లేస్‌మెంట్ పెరగడం వల్ల పర్ఫార్మెన్స్, పికప్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా, యమహా బైకులకు ఉండే ప్రధాన ప్లస్ పాయింట్ 'మైలేజ్' విషయంలో కూడా ఈ బైక్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో యమహా R3 బైక్ నిలిపివేయబడిన నేపథ్యంలో, ఇప్పుడు రాబోతున్న YZF-R2 బైక్ భారతదేశంలో యమహా కంపెనీకి 'ఫ్లాగ్‌షిప్' (టాప్-ఎండ్) మోడల్‌గా మారే అవకాశం ఉంది. ఈ సరికొత్త R2 మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న R15, MT-15, , XSR155 బైక్‌ల అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ కొత్త బైక్ ఏ పాత మోడల్‌ను రీప్లేస్ చేయడం లేదు.

Post a Comment

0 Comments

Close Menu