చెన్నైలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకేసిన ప్యాసింజర్

Telugu Lo Computer
0


చెన్నై ఎయిర్‌పోర్టులో ఎయిర్ అరేబియా విమానంలోని ప్రయాణికుడు ఒకరు ఎమర్జెన్సీ తలుపు తెరిచి కిందకు దూకేశారు. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండయ్యాక టాక్సీవే మీదుగా టర్నమిల్‌ వేపు వెళుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, విమానం మెల్లిగా కదులుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఎయిర్‌పోర్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అన్నారు. విమానం కూడా దెబ్బతినలేదని చెప్పారు. అప్పటికే ప్రయాణికుడు అనారోగ్యంతో ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రయాణ సమయంలో అతడు అప్పటికే వాంతులు చేసుకున్నట్టు కూడా తెలిసింది. ప్రయాణికుడు కిందకు దూకిన విషయం తెలియగానే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కారణంగా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 3.23 గంటల నుంచి గంట పాటు రన్‌వేను మూసేసి ఇతర విమానాలను రెండవ రన్‌వేపై దారి మళ్లించారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default