ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం పరిధి, దేవీపట్నం మండలం రామదుర్గం కొండల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో తిరుగుతున్న పులి, తాజాగా రామదుర్గం కొండ పరిసరాల్లో కనిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో రాజానగరం మండలంకు చెందిన సుమారు 50 మంది సందర్శకులు యాత్ర నిమిత్తం రామదుర్గం కొండకు వెళ్లి చిక్కుకుపోయారు. పులి సంచారం విషయం తెలియక వెళ్లిన వీరు.. ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంపీ పురందేశ్వరి కార్యాలయం జిల్లా కలెక్టర్, డీఎఫ్‌వోకు సమాచారాన్ని అందించింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై.. సందర్శకులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ట్రాక్టర్లతో బృందాలను పంపించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పులి సంచారం గురించి తెలియక యాత్రకు వెళ్లిన సందర్శకులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
0 Comments