Ad Code

రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే కారు : తరలి వచ్చిన జనం : చేతులెత్తిసిన వ్యాపారి


తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌ గిరి జిల్లా మల్లాపూర్‌ కు చెందిన రోషన్ అనే వ్యాపారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ. 26 వేలకే కార్లను విక్రయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. తన వద్ద ఉన్న 50 కార్లను ఇదే ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రోషన్ కార్ల షాపు వద్దకు వచ్చారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చారు. అయితే అక్కడ కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయి. జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. దీంతో రోషన్ చేతులెత్తేశాడు. అలా వ్యాపారి చాలాసేపటి వరకు రాకపోవడంతో జనాలు ఆగ్రహానికి గురయ్యారు. షాపులో ఉన్న కార్లపై రాళ్లు రువ్వి దాడి చేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసి నాచారం పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో అనేకం వస్తుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిలో నిజమెంతో తెలియకుండా ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్ల మాయ మాటలను నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu