విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్‌ను హీరో సాయి శ్రీనివాస్ కలిసి పెళ్లికి రావాల్సిందిగా వారిద్దరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వీరి నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ వేడుక జరగనుంది. హీరో సాయి శ్రీనివాస్ వివాహం చేసుకోబోయే కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. ఆమె కుటుంబానికి న్యాయవ్యవస్థతో బలమైన సంబంధం ఉంది. కావ్య తాతగారు గతంలో జడ్జిగా పని చేయగా, తండ్రి ప్రముఖ లాయర్. కావ్య సోదరి, సాయి శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదువుకున్నారని, ఆ పరిచయం ద్వారానే శ్రీనివాస్ - కావ్యల మధ్య స్నేహం ఏర్పడిందని సమాచారం. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
0 Comments