తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బాను చంద్రరెడ్డి(32) సోమవారం తన అపార్ట్మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఐబీఎంతో పనిచేస్తున్న ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత బాను చంద్ర రెడ్డి బెంగళూర్‌లో ఉద్యోగం కోసం ఏడాదిగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయానని, దీని వల్ల ఆదాయం లేకుండా పోయిందని ఆయన మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడం వల్ల బానుచంద్రరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి తోడు మతాంతర వివాహం చేసుకోవడం వల్ల కుటుంబ మద్దతు లేకపోవడం కూడా మానసికంగా కుంగదీసింది. తెలంగాణలో బలమైన రాజకీయ సంబంధాలు ఉన్న అతడి తండ్రి వివాహాన్ని వ్యతిరేకించడంతో కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కుటుంబం నుంచి మద్దతు కరువై, ఉద్యోగం లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. తన ఆత్మహత్యకు తన భార్యను నిందించొద్దని రాసిన సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
0 Comments