Ad Code

మార్చి 17న ఒప్పో ఫైండ్ ఎన్ 6 ఫోన్‌ విడుదల


మార్చి 17న గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఒప్పో ఫైండ్ ఎన్ 6 ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుకంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ఒప్పో వాచ్ ఎక్స్ 3 స్మార్ట్‌వాచ్‌ను కూడా కంపెనీ పరిచయం చేయబోతోంది. ఫోల్డబుల్ ఫోన్లలో సాధారణంగా కనిపించే సమస్య స్క్రీన్ మధ్యలో వచ్చే మడత. అయితే ఫైండ్ ఎన్ 6లో కొత్త జనరేషన్ టైటానియం అలాయ్ డోమ్ హింజ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల స్క్రీన్ మడత దాదాపు కనిపించదని, దీర్ఘకాలం ఉపయోగించినా డిస్‌ప్లే స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో 8.12 అంగుళాల 2K LTPO ప్రధాన డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అలాగే బయట భాగంలో 6.62 అంగుళాల సెకండరీ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అత్యంత వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. ఈ ఫోన్ కెమెరా వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో 200 MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిలో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా AI స్టైలస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది కేవలం నోట్ తీసుకోవడానికి మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 16GB RAM & గరిష్టంగా 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.

Post a Comment

0 Comments

Close Menu