Ad Code

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ


మిళనాడులోని కరూర్‌ తొక్కిసలాట కేసులో మార్చి 10న విచారణకు హాజరు కావాలని టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కాగా గత ఏడాది సెప్టెంబర్‌ 27న కరూర్‌ లో విజయ్‌ నిర్వహించిన ప్రచారసభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేసింది. కరూర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండటంతో విచారణలో భాగంగా విజయ్‌ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలోని దర్యాప్తు కార్యాలయానికి హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై విజయ్‌ స్పష్టతనివ్వాల్సి ఉండటంతో అతడికి మరోసారి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ర్యాలీ సమయంలో జనసమూహ నిర్వహణ ఏర్పాట్లు, ఈవెంట్ వేదికకు మంజూరు చేసిన అనుమతులు, టీవీకే పార్టీ వాదనలు, తమిళనాడు ప్రభుత్వ వాదనలపై తాము దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu