Ad Code

రీల్స్ కోసం బైక్ స్టంట్ చేస్తూ యువకుడు మృతి : మరొకరి పరిస్థితి విషమం


ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో రీల్స్ కోసం బైక్ స్టంట్లు చేస్తూ ఓ యువకుడు దుర్మరణం పాలవ్వగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కడప నగరానికి చెందిన ముబారక్ అనే యువకుడు మరో స్నేహితుడితో కలిసి అర్థరాత్రి ఒంటి గంట సమయంలో విమానాశ్రయం రోడ్డులో బైక్ రైడింగ్ చేస్తూ రీల్స్ చిత్రీకరించడం ప్రారంభించారు. అతివేగంగా వెళ్తూ బైక్ ముందు టైర్‌ను గాలిలోకి లేపి స్టంట్లు చేస్తున్న క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాద తీవ్రతకు ముబారక్ బైక్ పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ఉన్న మరో యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu