Ad Code

రేపటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు


శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ అధికారులు ఆహ్వానించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనున్నట్లు ఈవో తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 40 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయం లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈనెల 14, 15న టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు లేకుండా వాహనా లను అనుమతిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజుకు మూడు స్లాట్లలో మాత్రమే వీఐపీ దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా రేపటి నుంచి 20వ తేదీ వరకు మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్టు ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా ప్రతీ ఏడాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈనెల 13 నుంచి నాలుగు రోజుల పాటు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తారు. ప్రభుత్వం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నారు. కాగా.. శ్రీశైలం కు బ్రహ్మోత్సవాల వేళ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయం మొత్తం శోభాయ మానంగా తీర్చి దిద్దారు.

Post a Comment

0 Comments

Close Menu