Ad Code

తిరుపతిలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య


మిళనాడుకు చెందిన బీటెక్‌ విద్యార్థిని ఎం. రీత (19) తిరుపతిలో ఆత్మహత్య చేసుకుంది.చదువు సంబంధిత ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె గతంలో తన తల్లికి చెప్పినట్టు తెలిసింది. తరచూ ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని కూడా పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ఈ ఘటన అద్దం పడుతోంది. చదువు భారం, భవిష్యత్ ఆందోళనలు విద్యార్థులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. గత నెల 30న రీత తిరుపతికి వచ్చినట్టు సమాచారం. ఆమె ఒక ప్రైవేట్ హోటల్‌లో గది తీసుకుని అక్కడే బస చేసింది. చాలా సేపు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం కలిగింది. గదిని తెరిచి పరిశీలించగా ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె కనిపించింది. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 


Post a Comment

0 Comments

Close Menu