యూఏఈలో హానర్ ఎక్స్ 6డీ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. గత ఏడాది చైనాలో విడుదలైన హానర్ ప్లే 60ఏ మోడల్‌కు దగ్గరగా ఉండే స్పెసిఫికేషన్లతో ఈ కొత్త ఫోన్ వచ్చింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. దీనిలో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌ను 6nm MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ నడిపిస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 256GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9 ఉన్నాయి. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరా (f/2.0 అపర్చర్), 1080p వీడియో రికార్డింగ్ (30fps), 5MP ఫ్రంట్ కెమెరా (f/2.2) సాధారణ వినియోగానికి సరిపడే కెమెరా సెటప్‌ను అందించారు. ఇంకా ఇందులో 5,260mAh బ్యాటరీ ఉంది. Wi-Fi, బ్లూటూత్ వంటి సాధారణ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఫోన్ ముందుభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, వెనుకభాగంలో స్క్వేర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ సైడ్స్, పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉండగా.. మ్యాట్ ఫినిష్ బ్యాక్‌పై గ్లోసీ కెమెరా మాడ్యూల్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది.
0 Comments