ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం.. ప్రధాన నిందితుడైన రాజ్ కేసీరెడ్డి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వానికి కేసీరెడ్డి కేవలం సలహాదారుడు మాత్రమేనని అతని తరపు న్యాయవాది తెలుపగా ఆయన వాదనలను సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది. కెసిరెడ్డి కేవలం సలహాదారు మాత్రమే కాదని, సూత్రధారి అని పేర్కొంది. ఈ కేసులో మొత్తం వ్యవహారానికి రాజ్ కేసీరెడ్డినే ప్రధాన కుట్రదారుడని పేర్కొంది. పదవిలో ఉన్నవారి అండలేకుండా అధికారులు ఇంతపెద్ద స్కామ్ చేయలేరని ఆరోపించింది. ఇప్పటికే కేసీరెడ్డి జైలులో ఉండి పది నెలలు గడిచిందని, సప్లిమెంటరీ ఛార్జిషీట్లు కూడా దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఈ సూర్యకాంత్ మరికొంతకాలం జైల్లోనే ఉంటే వచ్చిన నష్టమేమిలేదని లేదన్నారు. గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్ కేసీరెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ ను డిస్మిస్ చేసేందుకు కోర్టు సిద్ధమవ్వడంతో తమ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని కేసీరెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. అందుకు అంగీకరించింది. ఈ కుంభకోణంలో కేసీరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. రూ.750 కోట్లు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీలతో కేసీరెడ్డికి నేరుగా సంబంధాలున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం తెలిపింది. కేసీరెడ్డి జైలులో ఉండి ఇప్పటికే 10 నెలలు గడిచిపోయానని.. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఏం కాదని.. మరికొంతకాలం జైలులో ఉండనీయండని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేసీరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం ససేమిరా అంటూ పిటిషన్ను డిస్మిస్ చేసేందుకు సిద్ధమైంది. అయితే పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేసీరెడ్డి తరఫు న్యాయవాది పేర్కొనడంతో అనుమతించింది.
0 Comments