మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన త్రీ-వీలర్ ఆటోరిక్షా ''ఉడో''ను లాంచ్ చేసింది. రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 3,84,299 కన్నా తక్కువ. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫుల్ మోనోకోక్ నిర్మాణం దీని ప్రత్యేకత. ప్రతాప్ బోస్ దీనిని డిజైన్ చేశారు. బోల్డ్ హెడ్ ల్యాంప్స్, వెడల్పైన విండ్ షీల్డ్ ఉన్నాయి. డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డ్రైవర్ల కోసం 20 శాతం మందంగా ఉండే ''ఫైలట్ సీట్'' ఇందులో ఉంది. 11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఉడో 10 kW పీక్ పవర్, 52 Nm టార్క్ అందిస్తుంది. ఒక్క ఛార్జ్‌తో 265 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది, రియల్‌గా 200 కి.మీ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది రేంజ్, రైడ్, రేస్ మోడ్‌లను కలిగి ఉంటుంది. రేస్ మోడ్‌లో గంటలకు 55 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.
0 Comments