Ad Code

లిచి పండు - ఆరోగ్య ప్రయోజనాలు


తెలుపు-గులాబీ రంగులో ఉండే లిచిలో విటమిన్ సీ అధికంగా ఉండటం వలన ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. జలుబు, ఫ్లూ, దగ్గు వంటి వాటి నుండి రక్షణ కల్పిస్తుంది, స్కర్విని నివారిస్తుంది. విటమిన్ సీ, నీటి శాతం పుష్కలంగా ఉన్నందున లిచి చర్మ ఆరోగ్యానికి ఉత్తమం. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడంలో తోడ్పడుతుంది. లిచిలో ఉండే అధిక డైటరీ ఫైబర్ కొవ్వు పేరుకుపోవడాన్ని అరికట్టి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సీ రక్తపోటును తగ్గిస్తుంది. లిచి ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి క్యాన్సర్ నిరోధక ప్రభావాలు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి సంభవించకుండా నిరోధించవచ్చు. బరువు తగ్గించే ప్రణాళికలో ద్రవ సమతుల్యత కీలకం. వ్యాయామం, ఆహారం కొన్నిసార్లు పోషకాలను కోల్పోయేలా చేసి నిర్జలీకరణానికి దారితీస్తాయి. లిచి, పొటాషియం మూలంగా సోడియం స్థాయిలను నియంత్రిస్తూ, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేస్తుంది, తద్వారా శరీర ద్రవ స్థాయిలను కాపాడుతుంది. లిచిలో ఉండే పెక్టిన్ అనే డైటరీ ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలకు, మంచి జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. దీనిలోని అధిక నీటి శాతం మలబద్ధకాన్ని నివారిస్తూ, పెద్దప్రేగు క్యాన్సర్, పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లిచిలోని అధిక రాగి నిల్వలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మెరుగైన రక్త ప్రవాహం, ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది. లిచి పండ్ల సారం ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయస్సు మీద పడుతూ వస్తుండటం వల్ల సహజంగానే ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. అలాంటి పరిస్థితిని నివారించడంలో సహాయపడుతుంది లిచీ ఫ్రూట్. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇది సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. పులుపు, తీపి, వగరు వంటి రుచులు ఉంటాయి లిచీలో. తినడానికీ బాగుంటుంది.

Post a Comment

0 Comments

Close Menu