హైదరాబాద్ లోని రాయదుర్గంలో అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ "డాయిష్ బోర్స్ గ్రూప్" గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్‌గా ఉన్న డాయిష్ బోర్స్ గ్రూప్ హైదరాబాద్‌ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పటిష్ఠమైన పాలసీలు, స్థిరత్వం, ఇక్కడి టాలెంట్ పూల్‌పై గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రపంచంలోని టాప్ 10 అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలలో ఏడు ఇక్కడ నిర్వహిస్తుండటం మనకు గర్వకారణమన్నారు. డాయిష్ బోర్స్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ క్యాపిటల్, సంపదకు శక్తినిచ్చే కేంద్రంగా అంతర్జాతీయ యవనికపై మరోసారి నిరూపించుకుందన్నారు. నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్ హబ్‌గా మాత్రమే కాకుండా "గ్లోబల్ ఆవిష్కరణ పవర్‌హౌస్"గా మార్చేలా ఒక ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించబోతున్నట్లుగావెల్లడించారు. ఈ హబ్ రీసెర్చ్, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందన్నారు.
0 Comments