హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవల యాక్టివా 125, ఎస్ 125, ఎస్‌పీ 160 వాహన శ్రేణిని ఆధునికీకరించగా తాజాగా 2025 మోడల్ యూనికార్న్‌ను ఆవిష్కరించింది. ఓబీడీ2బీ ప్రమాణాలను అనుగుణంగా యూనికార్న్‌ను తీర్చిదిద్దింది. 2025 హోండా యూనికార్న్‌లో ముందువైపు స్వల్ప మార్పులు చేశారు. క్రోమ్ అలంకారంతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను ఇచ్చారు. ఇది మినహా పెద్దగా ఎలాంటి మార్పులూ చేయలేదు. రేడియంట్ రెడ్ మెటాకిల్, మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ ఇగ్నియస్ బ్లాక్ రంగుల్లో తీసుకొచ్చారు. పెరల్ సిరెన్ బ్లూర రంగును తొలగించారు. కొత్త యూనికార్న్‌లో ఫుల్లీ డిజటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లసర్‌తో వస్తోంది. ఇందులో స్పీడ్, గేర్ పొజిషన్, ఎకోమోడ్ ఇండికేటర్, సర్వీస్ అలర్ట్ వంటి ఫీచర్లను జోడించారు. దీంతో పాటు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను ఇచ్చారు. ఓబీడీ2బి ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇది మినహా హార్డ్‌వేర్ పరంగా పెద్దగా మార్పుల్లేవు. 5స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. హోండా కొత్త యూనికార్న్ ధర రూ.1.19 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ.8వేలు అధికం.
0 Comments