Ad Code

బెండకాయతో పాటు తినకూడని పదార్ధాలు !


బెండకాయలో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నిషియం, విటమిన్ బి, మాంగనీస్ వంటి పోషకాలున్నాయి. దీనిలో కాల్షియం, విటమిన్ కె ఎక్కుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. బెండకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఈ రెండింటిలో కాల్షియం ఉంటుంది. బెండకాయలో కాల్షియంతో పాటు ఆక్సలేట్ కూడా ఉంటుంది. పాలు, బెండకాయలు రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఆక్సలేట్‌ను ఏర్పరుస్తాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. కాకరకాయ, బెండకాయ సాధారణంగా రెండు పోషకాలు ఉన్న కూరగాయలు. అయితే, ఈ రెండింటిని కలిపి మాత్రం తినకూడదు. ఈ కాంబినేషన్ కడుపులో చికాకు కలిగిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ఈ రెండింటిని తింటే సమస్యలు వస్తాయి. సాధారణంగా కాకరకారయ వేడి స్వభావం కలిగి ఉంటుంది. అదే బెండకాయ చల్లటి స్వభావం. దీంతో కడుపు యొక్క పీహెచ్ బ్యాలెన్స్ భంగం కలుగుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, డయేరియా, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. బెండకాయ తిని టీ జోలికి పోకండి. టీ అనేది టానిన్ రిచ్ ఫుడ్. బెండకాయ తిన్న తర్వాత టీ తాగడం వల్ల పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ముల్లంగిని బెండకాయను కలిపి ఏ రూపంలోనూ తినకూడదు. ముఖ్యంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి. ఈ రెండింటిని తినడం వల్ల పొట్టలో ఎసిడిటీ ఏర్పడుతుంది. ముల్లంగిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. బెండకాయతో తినడం వల్ల ఇవి రెట్టింపు అవుతాయి. దీంతో కడుపులో గ్యాస్ సమస్య పెరుగుతుంది. కడుపు నొప్పి, వాంతులు, పుల్లటి తేన్పులు వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెండకాయ, రెడ్ మీట్ రెండూ కలిపి తినకూడదు. ఈ రెండూ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. కడుపులో చికాకుతో పాటు అనేక సమస్యలు వస్తాయి. బెండకాయల్ని మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా తింటే చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. బెండకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. మోకాళ్ల నొప్పితో బాధపడేవారు పొరపాటున వీటిని ఎక్కువ తింటే వాళ్ల నొప్పులు ఇంకా తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది. హై బీపీ సమస్యలతో బాధపడేవారు కూడా బెండకాయల్ని ఎక్కువగా తినకూడుదు. ఇది బీపీ సమస్యను ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu