దేశంలో మారుతి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్స్‌ని వెనక్కి నెట్టి నంబర్ 1గా అవతరించడం గమనార్హం. ఎంపీవీ అమ్మకాల్లో రెనాల్ట్ ట్రైబర్ రెండో స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ కారు మంచి సేల్స్‌ని సాధిస్తుంది. 2024 అక్టోబర్‌లో భారతదేశంలో రెనాల్ట్ నుంచి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో రెనాల్ట్ మొత్తం 3870 యూనిట్లను సేల్ చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 3861 (0.23) శాతం సేల్స్ పెరిగాయి. అయితే ఈ సంఖ్య తక్కువే అయినా అమ్మకాలు స్థిరంగా కొనసాగడం ఆ కంపెనీకి శుభసూచీకం. మొత్తం అమ్మకాల్లో 2,111 యూనిట్ల రెనాల్ట్ ట్రైబర్ కార్లు సేల్ అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే (2080) 1.49 శాతం వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2024 అమ్మకాల్లో రెనాల్ట్ నుంచి కిగర్ రెండవ స్థానంలో నిలిచింది. 2023 అక్టోబర్లో కేవలం 912 యూనిట్లను విక్రయించగా, 2024 అక్టోబర్‌లో 1,053 యూనిట్లను విక్రయించి 15.46% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది భారత్‌లో కిగర్‌కి పెరుగుతున్న ఆదరణకు అద్ధం పడుతోంది. మరోవైపు ఈ కంపెనీ నుంచి ఫేమస్ లైనప్‌గా ఉన్న రెనాల్ట్ క్విడ్ అమ్మకాలు తగ్గాయి.7 సీటర్ రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 71 bhp పవర్, 96 nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని ఇంటీరియర్ కూడా కంఫర్ట్‌గా లగ్జరీయస్ ఫీచర్లతో వస్తుంది. అందువల్ల ఈ MPV అమ్మకాల్లో కంపెనీలోని ఇతర కార్లతో పోల్చితే ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలదు. అలాగే డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ మోబైల్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, సెంట్ కన్సోల్‌లో గోల్డ్ స్టోరేజ్ వంటి అదనపు ఫీచర్లు కలవు. ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువే అని చెప్పాలి. సేఫ్టీ పరంగా నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇక రెనాల్ట్ ట్రైబర్ ధరలు రూ.6 లక్షల నుంచి 8.69 లక్షల మధ్యలో ఉన్నాయి. కుటుంబాలతో కలిసి ఎక్కువ మంది ప్రయాణించే ఇది అనువుగా ఉంటుంది. మరుతి ఎర్టిగా కంటే తక్కువ ధరకు ఈ కారు అమ్ముడవుతోంది.
0 Comments