బజాజ్ ఆటో నుంచి సరికొత్త పల్సర్ N125 బైక్ వచ్చేసింది. దీని ప్రారంభ ధర రూ. 94,707 (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఈ పల్సర్ ఎన్125 బైక్ పల్సర్ ఎన్ సిరీస్‌లో భాగం. దేశీయ మార్కెట్లో ఈ పాత మోడల్ 3 లక్షల అమ్మకాలను సాధించింది. ఈ కొత్త పల్సర్ ఎన్125 డిజైన్ సూపర్‌మోటార్డ్ మోడల్‌ల నుంచి ప్రేరణ పొందింది. ఈ బైక్‌లో ఏరోడైనమిక్ ఫ్లోటింగ్ ఫ్రంట్, రియర్ ప్యానెల్‌లు ఉన్నాయి. మోటార్‌సైకిల్ 124.58సీసీ, సింగిల్-సిలిండర్, 2-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 12పీఎస్ పవర్, 11ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) పొందిన మొదటి పల్సర్ ఇదే. పల్సర్ ఎన్125లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 240ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, 130ఎమ్ఎమ్ రియర్ డ్రమ్, సీబీఎస్ ఉన్నాయి. కర్బ్ వెయిట్ 125కిలోలు, సీటు ఎత్తు 795ఎమ్ఎమ్, గ్రౌండ్ క్లియరెన్స్ 198ఎమ్ఎమ్. మీరు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్ డిజిటల్ ఎల్‌సీడీ కన్సోల్‌ను పొందుతారు. ఎల్ఈడీ డిస్క్ వేరియంట్, ఎల్ఈడీ డిస్క్ బీటీ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ వేరియంట్‌లో పెరల్ మెటాలిక్ వైట్, ఎబోనీ బ్లాక్, కరేబియన్ బ్లూ, కాక్‌టెయిల్ వైన్ రెడ్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. అయితే, ఎల్ఈడీ డిస్క్ బీటీ వేరియంట్ ఎబోనీ బ్లాక్ + పర్పుల్ ఫ్యూరీ, ఎబోనీ బ్లాక్ + కాక్‌టెయిల్ వైన్ రెడ్, ప్యూటర్ వంటి డ్యూయల్-టోన్ గ్రే ప్లస్ సిట్రస్ రష్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
0 Comments