Ad Code

వెదురు బొంగుతో డ్రోన్‌ !


బెంగళూరుకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్, ప్రొడక్ట్‌ డిజైనర్‌ దీపక్‌ దధీచ్‌ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే వ్యక్తి. సుస్థిరమైన పదార్థాలతో రోబోటిక్‌ యంత్రాలను తయారు చేయవచ్చనే ఆలోచనతో అతడు అచ్చంగా వెదురు బొంగులతో డ్రోన్‌ను రూపొందించాడు. స్క్రూలు, నట్లు వంటివి తప్ప ఈ డ్రోన్‌లోని మిగిలిన భాగాలన్నింటినీ చీల్చిన వెదురు బొంగులతో తయారు చేశాడు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్‌ వస్తువుల తయారీకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కలపను ప్రధాన పదార్థంగా వినియోగించలేదు. వెదురుబొంగులతో పూర్తిగా పనిచేసే డ్రోన్‌ను తయారు చేసిన ఘనత దీపక్‌ దధీచ్‌కే దక్కుతుంది. దీని తయారీకి అతడికి వెయ్యి రూపాయల లోపే ఖర్చు కావడం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu