ఇండియాలో మోస్ట్ పాపులర్, టాప్ సెల్లింగ్ స్కూటర్‌గా హోండా యాక్టివా నిలుస్తోంది. కంపెనీ ఈ స్కూటర్‌లో కొత్త వెర్షన్లు తీసుకొస్తూ మరింత మందిని ఆకట్టుకుంటోంది. అంతేకాదు అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన అప్‌గ్రేడ్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్ యాక్టివా స్కూటర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే 4G, 5G, 6G స్కూటర్లను లాంచ్ చేసిన హోండా, ఈ లైనప్‌లో కొత్త మోడల్ 'యాక్టివా 7G'ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఈ ఏడాది డిసెంబర్‌లోనే వెహికల్ లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. యాక్టివా 6G లాగానే, యాక్టివా 7G కూడా వివిధ వెర్షన్లలో లభించే అవకాశం ఉంది. ఇవన్నీ వివిధ కలర్ ఆప్షన్స్‌లో రావచ్చు. దీని డిజైన్ యాక్టివా 6G లాగానే ఉండొచ్చు. కానీ, హోండా కంపెనీ బాడీ ప్యానెల్స్‌ను కొంచెం మార్చే అవకాశం ఉంది. అలాగే, కొన్ని చోట్ల క్రోమ్ డీటైల్స్ యాడ్ చేయవచ్చు. యాక్టివా 7Gలో ముందు భాగంలో డిస్క్ బ్రేక్, LED హెడ్‌లైట్ ఉంటాయి. హోండా యాక్టివా 7G స్కూటర్ గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాల్లో రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండవచ్చు. ఇది 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో లాంచ్ కావచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.6 BHP శక్తిని, 8.8NM పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక లీటర్ పెట్రోల్‌కు 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. యాక్టివా 7G స్కూటర్‌లో ఇంజన్‌ను ఆన్/ఆఫ్ చేయడానికి స్టార్ట్-స్టాప్ బటన్, నిశ్శబ్దంగా స్టార్ట్ చేయడానికి సైలెంట్ స్టార్టర్, తక్కువ శబ్దంతో నడపడానికి డ్యూయల్-ఫంక్షన్ స్విచ్ వంటివి ఉంటాయి. 12-అంగుళాల ఫ్రంట్ వీల్, 10-అంగుళాల బ్యాక్ వీల్‌తో వెహికల్ వస్తుందని సమాచారం. 7G సుపీరియర్ రైట్ క్వాలిటీ ఆఫర్ చేస్తుందని చెబుతున్నారు. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రావచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, హైబ్రిడ్ స్విచ్ మొదలైనవి కూడా ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది అండర్-సీట్ కెపాసిటీని కూడా కంపెనీ పెంచనుందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. హోండా యాక్టివా 7G స్కూటర్ ధర రూ.80,000 నుంచి రూ.90,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన ధరను ప్రకటించలేదు. ఈ సమాచారం అంతా మీడియా నివేదికలు వెల్లడించాయి. యాక్టివా 7G ఎడిషన్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా ఫాసినో 125 హైబ్రిడ్ స్కూటర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవచ్చు. ఫాసినో 125 బేస్ మోడల్ ధర రూ.79,900.
0 Comments