సినీ గాయకుడు మనో కుమారులు తమపై దాడి చేశారంటూ చెనై అలపాక్కంలోని మధురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు, మరో యువకుడు వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో మైనర్ సహా ఇద్దరిపై దాడి చేసినందుకు మనో కుమారులు సాహిర్, రఫీక్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం, మనో కుమారుల స్నేహితులు విఘ్నేష్, ధర్మ అరెస్టు చేసి జైలుకు పంపారు. మనో ఇద్దరు కుమారులు సహా ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ కేసులో మనో కుమారులకు, ఫిర్యాదు చేసిన ప్రత్యర్థి వర్గానికి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడం కలకలం రేపింది. ఫుటేజీలో, గాయకుడు మనో కుమారులు సాహిర్, రఫీక్‌లపై 4 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 16 ఏళ్ల బాలుడు సహా 10 మందికి పైగా వ్యక్తులు రాళ్లు మరియు కర్రలతో దాడి చేశారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే లోపు దాడి చేసి పారిపోయారు. ఈ సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి షాకింగ్‌గా మారింది. నా కూమారులు ఏ తప్పు చేయాలేదంటూ సిసి టీవీ విడియోలు రీలీజ్ చేశారు మను భార్య. నా గురించి, కుటుంబం గురించి తప్పుగా మాట్లాడటంతో మా కూమారులు అలా మాట్లాడవద్దని చెప్పారు. కానీ పదిమందికి పైగా యువకులు మా కూమారులు ఇద్దరి పై దాడులు చేశారు. పోలీసులు రావడంతో మా కూమారులు ఇద్దర్ని వదిలేసి పరారీ అయ్యారు. ఈ కేసు వెనుక ఏదో కుట్ర జరుగుతోంది అని అన్నారు. మను కోడలు మాట్లాడుతూ నా భర్త ఎలాంటి దాడులు చేయలేదు, మా మామా మనుకు ఉన్న పేరును చెడగొట్టేందుకు ఎవరో కుట్ర చేస్తున్నారు, నా భర్త తలపై రాయితో కొట్టి, కిందపడేసి, కర్రతో కొట్టారు అని ఆమె అన్నారు. మా ఇంట్లో పని చేసే వారిపై కూడా తీవ్రంగా దాడి చేశారు, దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయని ఆమె అన్నారు.
0 Comments