దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనలో ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ గురువారం ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసింది. డబ్ల్యూబీఎంసీ నిర్వహిస్తోన్న రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి ఘోష్ పేరును తొలగించిందని సంబంధిత అధికారి మీడియాకు వెల్లడించారు. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీని కోరింది. అలాగే సెప్టెంబర్ ఏడున మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే మాజీ ప్రిన్సిపల్ నుంచి సమాధానం రాకపోవడంతో ఈ వేటు పడినట్లు తెలుస్తోంది.
0 Comments