వికలాంగులు, వృద్ధులకు ఉచితంగా స్వామి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. వారి కోసమే రోజుకు ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల ఆలయం వెలుపల గేటు వద్ద పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుంది. వృద్ధులు, వికలాంగులు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో మిగతా అన్ని క్యూలను నిలిపివేస్తామని, అలాగే 20 రూపాయలు చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ తెలిపింది. దర్శనం పొంది ఎటువంటి సమస్య లేకుండా కేవలం 30 నిమిషాల్లో బయటికి రావచ్చు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే సీనియర్ సిటిజన్ వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి. వికలాంగులు, గుండె శస్త్రచికిత్సలు, మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా ఉన్నవారు కూడా ఉచితంగా తిరుమలను సందర్శించవచ్చు. ఈ సేవలకు ఐడీ రుజువుగా ఆధార్ కార్డ్ తప్పనిసరి. వికలాంగులు తమ గుర్తింపు కార్డుతో రావాలి. శారీరక వైకల్య ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జత చేయాలి. వృద్ధులు మరియు వికలాంగులు మినహా, పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ లేదా స్పెషలిస్ట్ జారీ చేసిన ఆధార్ కార్డ్, మెడికల్ సర్టిఫికేట్‌తో రావాలి.
0 Comments