హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా హోండా CB300R 2023ని లాంచ్ చేసింది. ఆధునిక టెక్నాలజీని రెట్రో-ప్రేరేపిత డిజైన్‌తో వచ్చింది. ఈ బైక్ ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). హోండా CB300R 2023 286.01cc, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OBD2A-కంప్లైంట్, PGM-FI ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 31.1PS శక్తిని, 27.5Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సున్నితమైన గేర్ మార్పులకు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా చేర్చింది. డిజైన్ వారీగా హోండా CB300R 2023 ఐకానిక్ హోండా CB1000R లీటర్-క్లాస్ రోడ్‌స్టర్ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో ఇంధన ట్యాంక్, నియో స్పోర్ట్స్ కేఫ్ DNA బీఫ్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, LED వింకర్‌లు, LED టెయిల్ ల్యాంప్‌తో కూడిన ఆల్-LED లైటింగ్ సిస్టమ్ ద్వారా బైక్ మరింత మెరుగుపడింది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హజార్డ్ లైట్ స్విచ్ ఉన్నాయి. హోండా CB300R 2023 మోటార్‌సైకిల్ కేవలం 146కిలోల బరువును కలిగి ఉంది. కేటగిరీలో అత్యంత తేలికైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. 41mm USD ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఎడ్జెస్ట్ చేయగల మోనోషాక్‌తో వచ్చింది. బైక్ 296mm ఫ్రంట్ డిస్క్, 220mm బ్యాక్ డిస్క్‌తో వస్తుంది. డ్యూయల్-ఛానల్ ABS ప్రామాణికమైనది. హోండా CB300R 2023 బైక్ పెరల్ స్పార్టన్ రెడ్, మాట్ మాసివ్ గ్రే మెటాలిక్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి.
0 Comments