Ad Code

కొత్త కర్వ్ సిరీస్ -ఎక్స్ ఎస్యూవీను విడుదల చేసిన టాటా మోటార్స్

దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ కొత్త కర్వ్ సిరీస్ -ఎక్స్ ఎస్యూవీను విడుదల చేసింది. ఈ మోడల్ ఆధునికతను ప్రతిబింబించే కూపే-స్టైల్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లు, సౌకర్యవంతమైన సీటింగ్,స్మార్ట్ టెక్నాలజీతో ఇది ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది.Curvv Series-X టాటా ICE పోర్ట్‌ఫోలియోలో భవిష్యత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తూ స్టైలిష్ ఎక్స్‌టీరియర్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ప్రాక్టికల్ వినియోగం తో ఈ SUVను వినియోగదారులకు ఆకర్షణీయంగా నిలుస్తుంది .టాటా మోటార్స్ ఈ కొత్త SUV భారతీయ మార్కెట్లో బడ్జెట్ ధరలో అందిస్తూ తమ స్థాయిని బలపరుచుకుంటూ వినియోగదారులకు ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందించనుంది . ఈ మోడల్ ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లు, ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించారు . కూపే-స్టైల్ సిల్హౌట్, బలమైన రోడ్ ప్రెజెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. Hyperion TGDi పెట్రోల్ ఇంజన్, Revotron పెట్రోల్ ఇంజన్, KryoJet డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వినియోగదారులకు విభిన్న ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. Smart E-Shifter, Paddle Shifters, Multi-Drive Modes వంటి ఆధునిక ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీలు డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయి. దీనిలో పానోరామిక్ సన్ రూఫ్ , JBL 9-స్పీకర్ సౌండ్ సిస్టం , Harman టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ , వైర్లెస్ చార్జర్,వెంటిలేటెడ్ సీట్స్ , ట్విన్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ది 5-Star BNCAP రేటింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ , ADAS Level-2, 360° కెమెరా , ESP, రైన్ సెన్సింగ్ విపేర్స్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి . 500 లీటర్ల బూట్ స్పేస్, R18 డైమండ్ కట్ అల్లోయ్ వీల్స్ , డిజిటల్ స్టీరింగ్ వీల్ , , 26.03 cm డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి స్పెసిఫికేషన్లు దీనిని ప్రీమియం SUVగా నిలబెడతాయి. దీని ఎక్స్ షో రూమ్ ధరలు Rs 9,99,990 /- లక్షల నుండి Rs 18,99,990 /- లక్షల వరకు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu