దేశీయ మార్కెట్లోకి ఆగస్టులో 'కియా సిరోస్ EV'ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మాస్-మార్కెట్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ కారు ఇప్పటికే మార్కెట్లో మంచి సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV , టాటా పంచ్ EV టాప్ వేరియంట్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మోడల్ అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టడానికి ముందే, భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ మరోసారి కెమెరాలకు చిక్కింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో ఈ స్పై చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. టెస్టింగ్ సమయంలో కారుకు భారీగా కవర్లు వేసినప్పటికీ.. సిరోస్ ఎస్‌యూవీకి ఉన్న సిగ్నేచర్ బాక్సీ స్టైలింగ్, పొడవైన టాల్‌బాయ్ లుక్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఇది ఎలక్ట్రిక్ కార్ అనడానికి ప్రధాన ఆధారం.. దీని ఎడమ వైపు ఫ్రంట్ ఫెండర్ఇచ్చిన చార్జింగ్ పోర్ట్. రెగ్యులర్ పెట్రోల్,డీజిల్ మోడళ్లతో పోలిస్తే.. ఈ ఈవీ వెర్షన్‌లో సరికొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, గాలికి తట్టుకునేలా ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ ఉండబోతున్నాయి. అంతేకాకుండా, స్పోర్టీ లుక్ కోసం ఇందులో బ్రైట్ గ్రీన్ కలర్ బ్రేక్ కాలిపర్స్, సవరించిన రూఫ్ రైల్స్ అందించారు. ఇక కియా స్టాండర్డ్ మోడల్స్ లాగే నిలువుగా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్-షేప్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, వర్టికల్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇందులోనూ కొనసాగించారు. అధునాతన సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ , అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సెన్సార్లు కూడా ఈ టెస్ట్ కార్లలో కనిపించాయి. సిరోస్ ఈవీ ఇంటీరియర్ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ, ఇది రెగ్యులర్ సిరోస్ మోడల్ డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పోలి ఉంటుందని అంచనా. కారు లోపల వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని ఇవ్వడానికి డ్యూయల్ 12.3-ఇంచ్ డిస్‌ప్లే సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్ + డిజిటల్ క్లస్టర్), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రేర్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్ , కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ వెర్షన్ కాబట్టి ఇందులో ప్రత్యేకంగా వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీని ఇస్తున్నారు. దీని ద్వారా కారు బ్యాటరీ నుండి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను చార్జ్ చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ డిస్‌ప్లేల కోసం సరికొత్త గ్రాఫిక్స్, ఈవీకి తగినట్లుగా కొత్త అప్హోల్స్టరీ (సీట్ల మెటీరియల్) మార్పులు ఉండబోతున్నాయి. కియా సిరోస్ ఈవీని కంపెనీ అధునాతన 'K1 ప్లాట్‌ఫారమ్'పైనే నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 'హ్యుందాయ్ ఇన్స్టర్ EV' లో కూడా ఇదే ఆర్కిటెక్చర్‌ను వాడారు. దీన్ని బట్టి చూస్తే, భారతీయ వెర్షన్ కోసం సుమారు 42kWh , 49kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కియా పరిశీలించే అవకాశం ఉంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌తో రానుంది. ఒకవేళ కియా కంపెనీ గ్లోబల్ మోడల్ లాగే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఇక్కడ కూడా అందిస్తే, సిరోస్ ఈవీ అత్యుత్తమ డ్రైవింగ్ రేంజ్‌ను ఇవ్వగలదు. (భారతదేశంలో తుది రేంజ్ అనేది ARAI సర్టిఫికేషన్ ఆధారంగా ఖరారవుతుంది). ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఇందులో డీసీ (DC) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీని సహాయంతో కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుండి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
0 Comments