Ad Code

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా అనురాగ్ కుమార్

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ కుమార్, ఈ నియామకానికి ముందు ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సతీష్ గోల్చాను పదవీకాలం పూర్తికాకముందే ఆ బాధ్యతల నుంచి తప్పించారు. 1992 బ్యాచ్ AGMUT కేడర్‌కు చెందిన గోల్చా 2027 వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉన్నప్పటికీ, పరిపాలనా మార్పుల్లో భాగంగా ముందుగానే రిలీవ్ చేశారు. అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గోల్చా తదుపరి పోస్టింగ్ కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu