Ad Code

తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం : పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల

ల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామంగా తల్లికి వందనం పధకాన్ని ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల అభివర్ణించారు. ఈ విషయంలో జగన్ వారసుడు చంద్రబాబు అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. వైసీపీ మోసాల్ని తూచా తప్పకుండా పాటించడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానంమన్నారు. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లుల్ని పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు నయవంచన చేస్తున్నారని షర్మిల విమర్శించారు. కోతల రాయుడు కోతలని జగన్ ను ఎద్దేవా చేసిన చంద్రబాబే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని షర్మిల ఆరోపించారు. 2023 జూన్ 29న ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు జగన్ కు సంధించిన ప్రశ్నల్ని మళ్లీ ఆయనకు గుర్తుచేశారు. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ? 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ? 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ? కారు (జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ? అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో దోపిడీనా ? అని వాటిని గుర్తుచేశారు. అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏమిటని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం ? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడం ఏంటి ? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకన్నారు. సవాలక్ష కారణాలతో పథకాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహించిన మీరే  300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ మీరు సైతం కొర్రీలు పెట్టడం ఎందుకని అడిగారు. నాన్న బుడ్డీని జగన్ గారు దోచుకున్నారు సరే.. మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారు కదా అని చంద్రబాబుకు అక్షింతలు వేశారు. తల్లికి వందనంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 87 లక్షల మంది బిడ్డలకి ఇవ్వాలని షర్మిల కోరారు. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలన్నారు. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu