పొద్దుతిరుగుడు గింజలుచూడటానికి చిన్నవిగా ఉన్నా, వీటిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు బహు మిన్న. వీటిని రోజూ తింటే శరీరానికి ఎలాంటి అద్భుత లాభాలు కలుగుతాయి. పొద్దుతిరుగుడు గింజలలో మన శరీరానికి అవసరమైన విటమిన్-E, మెగ్నీషియం, ప్రొటీన్లు మరియు హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా, పోషకాహార లోపం లేకుండా చూస్తాయి. అందుకే వీటిని ఆరోగ్యానికి ఒక మంచి బూస్టర్‌గా నిపుణులు అభివర్ణిస్తారు. ఈ గింజలను రోజూ ఒక స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల మన కండరాలు బలోపేతమవుతాయి. అంతేకాదు, ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇక దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. సన్ ఫ్లవర్ సీడ్స్ నిరంతరం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ గుండెను పదిలంగా ఉంచుతాయి. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మరియు రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహార ఎంపిక. ఈ గింజలను అలాగే పచ్చిగా తినడం కంటే కాస్త డ్రై రోస్ట్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని సాయంత్రం పూట స్నాక్స్‌లా తీసుకోవచ్చు లేదా రోజూ తినే సలాడ్స్, ఓట్స్, పెరుగు వంటి వాటిపై చల్లుకుని కూడా తినేయవచ్చు. రోజుకు ఒక చెంచా చొప్పున తింటే సరిపోతుంది. ఇక చిన్న సన్ ఫ్లవర్ సీడ్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ ఒక స్పూన్ చొప్పున ఈ గింజలను మన లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవడం ద్వారా గుండెను భద్రంగా ఉంచుకుంటూ, కండరాల బలాన్ని మరియు రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు.
0 Comments