దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ వర్షాకాలం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రెండూ చురుగ్గా సాగితే దేశ సంక్షేమానికి గొప్ప ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. అందుకే ఈ రెండూ మెరుగ్గా ఉండాలని, అంతా సజావుగా సాగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సభల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులకు తావులేకుండా, ఉభయ సభలలోనూ అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా, విపక్షాల ఆందోళనతో మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. అంతరిక్ష రంగ స్టార్టప్ 'స్కైరూట్' చేపట్టిన 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ ఆవిష్కర్తలే ఈ అద్భుత ఘనత సాధించారని ఆయన కొనియాడారు. ఇదే సమయంలో తాను ఇక్కడ 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ పరోక్షంగా చమత్కరిస్తూ విమర్శలు గుప్పించారు. దేశంలో తొలిసారి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ట్రయల్ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం సమర్థవంతంగా ఎదుర్కొన్నా.. ఇంకా పరిస్థితిలో మార్పు లేదన్నారు.
0 Comments