బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడిన కారణంగా రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఎన్‌నినో కారణంగా రుతుపవనాలు వచ్చినా వర్షాకాలం మొదలైనా వర్షాలు పడటం లేదు. ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రుతుపవనాల పునరుజ్జీవం ఈశాన్య భారతం లో మొదలై ఆ తర్వాత వచ్చే వారం ప్రారంభంలో తూర్పు, మధ్య, ఉత్తర భారత ప్రాంతాలకు విస్తరించనుందని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలలో పిడుగుపాట్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించారు.
0 Comments