Ad Code

అదుపుతప్పి బోల్తా పడిన లారీ బోల్తా : ప్రాణాపాయం నుంచి బయటపడ్డ డ్రైవర్, క్లీనర్‌

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామ సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వస్తున్న పాపయ్య లోడ్‌తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కాగా, వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu