Ad Code

రేపటి నుంచి ఆగస్టు 3 వరకూ నేతలెవరూ గాంధీ భవన్‌కి రావొద్దు : జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ సీరియస్

చాలా మంది ఇంఛార్జి మంత్రులు ప్రజల దగ్గరకు వెళ్లట్లేదనీ, ఎంతసేపూ గాంధీ భవన్ లోనే కూర్చుంటున్నారని జూమ్ మీటింగ్ లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓవైపు తెలంగాణలో ఓటర్లకు సంబంధించి SIR ప్రక్రియ జరుగుతూ, ప్రజలు అనేక సందేహాలతో ఉంటే.. కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఇంఛార్జులు.. ఆ సమస్యల్ని పట్టించుకోకుండా.. గాంధీ భవన్‌లో ఉండిపోతున్నారని రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఆగస్టు 3 వరకూ నేతలెవరూ గాంధీ భవన్‌కి రావొద్దు అని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఇకపై కాంగ్రెస్ నేతలు, ఇంఛార్జి మంత్రులూ.. తమ నియోజకవర్గాలకు వెళ్లి.. ప్రజలతో కలిసి.. SIR ప్రక్రియ సజావుగా జరిగేలా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్.. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై రిపోర్టు తెప్పించినట్లు తెలిసింది. అందులో 42 నియోజక వర్గాల్లో బాగానే పనిచేస్తుంటే.. 20 నియోజకవర్గాల్లో పనితీరు అంతంత మాత్రంగా ఉందనీ, 4 నియోజకవర్గాల్లో అస్సలు సంతృప్తిగా లేదని రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్.. కొందరు నేతలు పనిచెయ్యట్లేదని రుసరుసలాడినట్లు తెలుస్తోంది. ఇకపై కాంగ్రెస్ నేతలంతా ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉండాలనీ, నిరంతరం తమ నియోజకవర్గాలపై సమీక్షలు జరపాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ఎంపీలు కూడా.. నిరంతరం సమీక్షలు జరుపుతూనే ఉండాలి అని రేవంత్ ఆదేశించినట్లు తెలిసింది. ఇంఛార్జిలుగా వ్యవహరించే వారు పనిచెయ్యకపోతే, వారిపై చర్యలు ఉంటాయనీ, జులై 30న రివ్యూ ఉంటుందని రేవంత్ చెప్పినట్లు తెలిసింది.

Post a Comment

0 Comments

Close Menu