ఆగస్టు రెండో వారంలో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల ?

గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సిరీస్‌ను ఆగస్టు రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారిక లాంచ్‌కు ముందే గూగుల్ పిక్సెల్ 11ఏ కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గూగుల్ సరసమైన ధరలో తీసుకురానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, Tensor G6 ప్రాసెసర్, 8GB RAM వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. లీక్ వివరాల ప్రకారం గూగుల్ పిక్సెల్ 11aలో 6.3 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే ఉండనుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇస్తుందని సమాచారం. రిజల్యూషన్.. 1080 × 2424 పిక్సెల్స్, HDR బ్రైట్‌నెస్.. 2250 నిట్స్, పీక్ బ్రైట్‌నెస్.. 3350 నిట్స్.. ఈ స్పెసిఫికేషన్లతో ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. దీనిలో Tensor G6 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. దీనితో పాటు MediaTek M90 మోడెమ్ కూడా ఉండనుంది. ఈ ఫోన్‌లో 8GB RAM అందించనున్నట్లు సమాచారం. దీంతో రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, AI ఆధారిత ఫీచర్ల పనితీరు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇది అబ్సిడియన్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, ఫ్రాస్ట్ పర్పుల్, ఫాగ్ సిల్వర్ రంగుల్లో రానున్నది. దీనిలో 4,870mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది గత తరం Pixel 10aలో ఉన్న 5,100mAh బ్యాటరీతో పోలిస్తే కొంత తక్కువ సామర్థ్యం. అయినప్పటికీ Tensor G6 చిప్‌సెట్ మెరుగైన పవర్ మేనేజ్‌మెంట్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో కొత్త ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉండనున్నట్లు సమాచారం. దీనికి “Dokkaebi” అనే కోడ్‌నేమ్ ఉన్నట్లు లీక్ పేర్కొంది. అలాగే Face Unlock ఫీచర్‌ను కూడా గూగుల్ మరింత వేగంగా, భద్రంగా, తక్కువ వెలుతురులో కూడా సమర్థవంతంగా పనిచేసేలా అప్‌గ్రేడ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. Titan M3 Security Chipను ఉపయోగించే అవకాశం ఉందని లీక్‌లు సూచిస్తున్నాయి. దీంతో డేటా భద్రత, డివైస్ సెక్యూరిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం మొత్తం లీక్‌ల ఆధారంగానే ఉంది. Google ఇప్పటివరకు Pixel 11a స్పెసిఫికేషన్లు లేదా విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేయలేదు. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains