Ad Code

డుకాటి 2026 మల్టీ స్ట్రాడా V4 ర్యాలీ విడుదల

దేశీయ మార్కెట్లో ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి  2026 మల్టీ స్ట్రాడా  V4 ర్యాలీ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది. సుదూర ప్రయాణాలు, ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడే రైడర్ల కోసం రూపొందించిన ఈ బైక్ శక్తివంతమైన 1158cc V4 ఇంజిన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు, సెమీ-యాక్టివ్ సస్పెన్షన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ బైక్‌ను అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్‌పై రూపొందించారు. దీని డిజైన్ లాంగ్-డిస్టెన్స్ టూరింగ్‌తో పాటు కఠినమైన ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా మెరుగైన పనితీరును అందించేలా రూపొందించారు. ఈ బైక్‌లో 1,158cc V4 Granturismo ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 170 హార్స్‌పవర్ శక్తిని, 123Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో హైవేలపై వేగవంతమైన ప్రయాణం, ఆఫ్-రోడ్‌లో బలమైన పనితీరు రెండింటినీ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 32.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 32.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu